నేటి సూర్య ప్రతినిధి: ప్రజా భద్రతే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖ ప్రతిష్టను పెంచుతున్న చర్ల పోలీస్ స్టేషన్ సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గౌరవప్రదమైన గుర్తింపును అందించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకుని చర్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టే బుల్‌గా విధులు నిర్వహిస్తు న్న రాంబాబు, కానిస్టేబుల్‌గా సేవలందిస్తున్న రాములకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన సేవా పథకాలు ప్రకటించడం పట్ల మండల వ్యాప్తంగా హర్షాతి రేకాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖలో విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావం, ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో పనిచేస్తూ రాంబాబు, రాములు తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉంటూ సేవలు అందించడం వారి ప్రత్యేకతగా నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం వారి సేవలకు లభించిన గౌరవప్రదమైన గుర్తింపని పలువురు అభిప్రాయపడ్డారు. కష్టపడి పనిచేసే పోలీసు సిబ్బందికి ఇటువంటి పురస్కారాలు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రాంబాబు, రాములకు ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, వివిధ సంఘాల నాయకులు, మండల ప్రజలు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఆకాంక్షించారు.











