డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్లలో అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు, వైద్య సిబ్బంది.

నేటి సూర్య ప్రతినిధి : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని, సమాజాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని చర్ల సీఐ ఏ. రాజువర్మ , సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఆర్. జాన్ పిలుపునిచ్చారు.

ఈగల్ ఫోర్స్ తెలంగాణ శాఖ పిలుపు మేరకు మంగళవారం చర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో “డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం” అనే నినాదంతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. చర్ల సీఐ ఏ. రాజువర్మ గారి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసులు, వైద్య సిబ్బంది, ఆటో యూనియన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ర్యాలీ అనంతరం నిర్వహించిన సమావేశంలో సీఐ ఏ. రాజువర్మ గారు మాట్లాడుతూ, నేటి సమాజంలో డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనంగా మారుతోందన్నారు. మత్తు పదార్థాల వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబాలు, సమాజం కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. యువత తమ లక్ష్యాలను సాధించాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, క్రీడలు మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఆర్. జాన్  మాట్లాడుతూ, డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల వినియోగం శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. యువత తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ర్యాలీ సందర్భంగా డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని  కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటేనే డ్రగ్స్ అనే సామాజిక రుగ్మతను పూర్తిగా నిర్మూలించగలమని సీఐ  రాజువర్మ అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ఆర్. నర్సిరెడ్డి, పీ. కేశవ్, చర్ల గణేష్ ఆటో యూనియన్ అధ్యక్షులు పామర్రు బాలాజీ, ఆటో యూనియన్ నాయకులు, పట్టణ ప్రముఖులు, యువత, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్