తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటి సూర్య ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఉదయం 9 గంటలకు చర్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన నాయకుల సేవలను గుర్తుచేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మహిళా నాయకులు, యువజన విభాగ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు తెలిపారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణులు ఐక్యతను చాటుకోవడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చర్చించనున్నట్లు తెలిపారు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సకాలంలో హాజరై విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ నాయుడు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్