చర్ల, నేటిసూర్య ప్రతినిధి: భద్రాచలం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల బూత్ లెవల్ ఏజెంట్స్ (BLA) సమావేశానికి చర్ల మండలం నుంచి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి సుమారు 25 మేజిక్ లలో 250 మంది కార్యకర్తలు ఒకేచోట సమీకృతమై భద్రాచలం వైపు బయలుదేరారు.
సమావేశంలో నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతం, బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ, ఓటరు జాబితా పరిశీలన, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అంశాలపై నాయకత్వం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నట్లు నాయకులు తెలిపారు.
చర్ల మండలం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నాయకులు ఆనందం వ్యక్తం చేసారు. సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కార్యకర్తలు నినాదాలతో, ఉత్సాహభరిత వాతావరణంలో భద్రాచలం వైపు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన ముఖ్య నాయకులు, బీఎల్‌ఏలు, ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










