శౌర్య పతకానికి ఎంపికైన చర్ల సీఐ రాజవర్మ.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటి సూర్య ప్రతినిధి : చర్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజవర్మకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక “శౌర్య పతకం” ప్రకటించడం పట్ల మండల ప్రజలు, యువత, వివిధ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకొని జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ గౌరవం చర్ల మండలానికి గర్వకారణంగా నిలిచింది. చర్ల సీఐగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే రాజవర్మ తన సమర్థవంతమైన విధి నిర్వహణతో ప్రజల మన్ననలు పొందారు. ఒకప్పుడు మావోయిస్టు ప్రభావానికి కేంద్రంగా భావించిన ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, మావోయిస్టు కార్యకలా పాలను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మండలాన్ని ప్రశాంత వాతావరణంలో ముందుకు తీసుకెళ్లడంలో విశేష కృషి చేశారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం ఆయనను ప్రత్యేక అధికా రిగా నిలబెట్టాయి. పోలీసు శాఖపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు నిరంతరం కృషి చేయడంతో పాటు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తూ పలు సమావేశాలు, విద్యార్థులకు ప్రేరణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాకుండా సామాజిక బాధ్యతతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహి స్తూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిం చుకున్నారు. ప్రజల సమ స్యలను నేరుగా తెలుసుకొని వెంటనే స్పందించడం, బాధితులకు అండగా నిలవడం, ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి లక్షణాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి.విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలు, ప్రజల భద్రత కోసం చేసిన విశేష సేవలు, శాంతిభద్రతల పరిరక్షణలో సాధించిన ఫలితాలకు గుర్తింపుగానే రాష్ట్ర ప్రభుత్వం శౌర్య పతకాన్ని ప్రకటించిందని పలువురు అభిప్రాయ పడ్డారు.ఈ సందర్భంగా చర్ల మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, యువజన సంఘాలు సీఐ రాజవర్మకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారా లు అందుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్