నేటి సూర్య ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండల కేంద్రంలో హనుమజ్జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్లలోని చిన్న ఇంద్రకీలాద్రిపైవెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. చర్ల మండల ధర్మరక్షణ కమిటీతో పాటు అమ్మవారి సేవా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ముందుగా శ్రీ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం సమిష్టిగా నిర్వహించారు. భక్తులు “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నామస్మరణలతో ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక వాతావరణంతో నింపివేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు హనుమంతుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ధర్మ రక్షణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హనుమంతుడు భక్తి, ధైర్యం, సేవాభావానికి ప్రతీక అని తెలిపారు. యువత హనుమంతుని ఆదర్శంగా తీసుకుని ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ఎడారి రమేష్ ప్రసాదాలను వితరణ చేసారు . ఈ కార్యక్రమంలో ధర్మరక్షణ కమిటీ సభ్యులు, ఆలయ సేవా కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పానిర్వాహ











