చిన్న ఇంద్రకీలాద్రిపై కిటకిటలాడిన భక్త సంద్రోహం.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం,  శ్రీ చిన్న ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అలాగే ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రాసన మహోత్సవాలు అలాగే అక్షరాభ్యాసాలు అంగరంగ వైభవంగా కొనసాగు తున్నాయి. చిన్నారులకు తల్లిదండ్రులు అమ్మవారి సాక్షిగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి చిన్నారులకు ఆశీర్వచనాలు అందించారు.

శుక్రవారం సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ కూడా నిర్వహించారు. భక్తులు “అమ్మవారి కృపతో కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని” ప్రార్థిస్తూ దర్శనం చేసుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్