శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి కి వెండి పళ్ళెం, వెండి చెంబు సమర్పించిన దంపతులు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటి సూర్య ప్రతినిధి : అమ్మలగన్న అమ్మగా కోట్లాది భక్తుల ఆరాధనలను అందుకుంటున్న చిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయం లో శుక్రవారం భక్తి పారవశ్యంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. చిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు.

కొత్తపల్లి శ్రీనివాస్ రావు గారి కుమార్తె చుండ్రు స్వాతి – బుల్లి రాజు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిపై ఉన్న అపారమైన భక్తి, విశ్వాసాలకు గుర్తుగా వారు పట్టుచీర, గాజులు, వెండి పళ్లెం, వెండి చెంబును అమ్మవారికి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందించారు.

శుక్రవారం కావడంతో ఆలయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల “జై కనకదుర్గమ్మ” నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగి పోయాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్