భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల కి చెందిన రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు ములుగు జిల్లా మేడారంలోని ప్రసిద్ధ శ్రీ సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మక్క-సారలమ్మ తల్లులకు బంగారం సమర్పించి తన భక్తిని చాటుకున్నారు.
అనంతరం రైతుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా మొక్కులు తీర్చినట్లు, రాష్ట్రంలోని రైతులందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని దేవతలను ప్రార్థించారు. రైతు కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు తెలిపారు.
రైతే దేశానికి వెన్నెముక అని, రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రైతుల కష్టాలు తొలగి ప్రతి రైతు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.
Post Views: 15











