నేటి సూర్య ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ప్రసిద్ధిగాంచిన చిన్న అరుణాచల శివాలయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ శివ నాగ స్వామి గారు ఇటీవల చర్ల మండలంలోని ఎదురిగుట్టలపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం మరియు శివాలయానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ప్రాంతానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఎంతో ఉన్నదని, భక్తులకు ఇది పవిత్రక్షేత్రంగా మారే అవకాశముందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా రాబోయే మే 1వ తేదీన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవం కోసం అవసరమైన ఉత్సవమూర్తుల విగ్రహాలు, అలాగే భక్తులకు అందించే అన్నప్రసాద కార్యక్రమానికి కావాల్సిన మొత్తం ఖర్చును నరసాపురం చిన్న అరుణా చల ట్రస్ట్ ప్రతీ సంవత్సరం భరిస్తూ వస్తోందని అన్నారు.
ఈ ఏడాది మే 1న జరిగే కల్యాణ కార్యక్రమానికి ప్రత్యేకతగా, చిన్న అరుణా చల వ్యవస్థాపకులు శివ నాగ స్వామి ఆయనే ఉత్సవమూ ర్తులను తీసుకువచ్చి, స్వయానా వారి చేతుల మీదుగా కల్యాణ మహో త్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరారు.
ప్రతి సంవత్సరం కల్యాణ మహోత్సవానికి సంబంధిం చిన మొత్తం ఖర్చును శ్రీ పెందుర్తి ఆంజనేయులు దంపతులు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తు న్నారని తెలిపారు. వారి సేవాభావం ఆదర్శప్రాయ మని స్వామి గారు ప్రశంసించారు.
ఈ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు మరియు అన్నప్రసా ద పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహ కులు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెరుగుతుందని, భక్తులకు విశేషమైన అనుభూతి కలుగుతుందని తెలిపారు.










