ఎదిర గుట్టల వద్ద వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల ప్రాంతంలోని ఎదిరి గుట్టలపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 30వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించాయి. భక్తి, శ్రద్ధల నడుమ జరిగే ఈ మహోత్సవానికి భారీగా భక్తులు హాజరవుతారని  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఏప్రిల్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రత్యేక పూజా కార్యక్రమాల మధ్య ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు సమీప ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అన్నప్రసాద కార్యక్రమానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రతి సంవత్సరం శాశ్వతంగా ‘చిన్న అరుణాచలం’ అందిస్తుందని… చిన్న అరుణాచలం వ్యవస్థాపకులు  శివ నాగ స్వామి  తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, రేపు (గురువారం) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వామివారి దర్శనం కోసం చర్లకు ప్రయాణమవుతున్నట్లు శివ నాగ స్వామి వెల్లడించారు. భక్తులు ఈ పవిత్ర సందర్భంగా స్వామివారి దివ్య దర్శనం పొందుతూ ఆశీర్వాదాలు పొందాలని కోరారు.

స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా జరిపించాలని ఆలయ నిర్వాహకులు పిలుపునిచ్చారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్