కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తపల్లి రామాంజనేయులు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన కొత్తపల్లి రామాంజనేయులు.

రైతుల సమస్యలపై చర్చ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌ను చర్ల రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయు లు,భద్రాచలం MLA తెల్లం వెంకట్రావుతో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

కలెక్టర్ అంకిత్‌ను కలిసిన అనంతరం కొత్తపల్లి రామాంజనేయులు పూల బొకేను అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగు నీటి సౌకర్యాలు, మార్కెట్‌లో ధరల స్థిరీకరణ వంటి అంశాలపై కలెక్టర్‌తో సవివరంగా చర్చించారు.

ఈ సందర్బంగా రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి ఆంజనేయులు  రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. రైతులకు అవసరమైన సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు పంటలకు సరైన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు కోరారు. అలాగే సాగునీటి సమస్యలు పరిష్కరిం చడానికి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్ అంకిత్ స్పందిస్తూ, రైతుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

ఈ సమావేశం ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి మరింత చైతన్యం కలుగుతుందని, ప్రభుత్వ-రైతుల మధ్య సమన్వయం బలోపేతం అవుతుందని అభిప్రాయపడదాం…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్