శ్రీ వారాహి అమ్మవారి ఆలయానికి భక్తుల నుంచి విరాళాలకి పిలుపు .

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

శ్రీ వారాహి అమ్మవారి ఆలయానికి భక్తుల నుంచి విరాళాలకి పిలుపు –

చర్లలో ఆధ్యాత్మిక ఉత్సాహం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం చర్ల గ్రామంలో ఉన్న శ్రీ శిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించబడిన శ్రీశ్రీశ్రీ వారాహి అమ్మవారి ఆలయం భక్తి శ్రద్ధల మధ్య ప్రారంభమై ఆధ్యాత్మిక కేంద్రముగా మారుతోంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, అర్చకులు కలిసి అమ్మవారికి నిత్య ధూపదీప నైవేద్యాల నిర్వహణ కోసం భక్తుల సహకారాన్ని కోరుతున్నారు.

అమ్మవారికి ఒక సంవత్సరం పాటు ధూపదీప నైవేద్యాలు నిరంతరంగా నిర్వహించేం దుకు ప్రతి భక్తుని నుండి రూ.516 విరాళంగా స్వీకరిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ విరాళాల ద్వారా ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు సక్రమంగా కొనసాగించబ డతాయని అన్నారు.

ఇందులో భాగంగా విరాళం అందించే ప్రతి భక్తుని పేరుమీద ప్రత్యేకంగా పూజలు నిర్వహించబ డతాయి. నెలలో ప్రతి పౌర్ణమి లేదా అమావాస్య రోజున భక్తుల గోత్రనామా లతో మాసపూజ నిర్వహించి, వారి కుటుంబాలకు అమ్మ వారి ఆశీస్సులు అందేలా చూస్తామని ఆలయ అర్చకు లు తెలిపారు. అలాగే ప్రతి శుక్రవారం రాత్రి 7 గంటల తర్వాత కుంకుమార్చన కార్యక్రమం కూడా భక్తి పరవశంలో నిర్వహించ బడుతోంది.

ఈ పూజల్లో పాల్గొనదలచిన భక్తులు ప్రత్యక్షంగా హాజరై సేవలలో భాగస్వాములు కావచ్చని, హాజరుకాలే కపోయినా వారి పేరుమీద పూజలు నిర్వహించే బాధ్యత తమదేనని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

శ్రీ వారాహి అమ్మవారి కృపాకటాక్షం అందరికీ లభించాలని ఆకాంక్షిస్తూ, ఈ పవిత్ర కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహకారం అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కమిటీ సభ్యులు మనస్ఫూర్తిగా కోరుతు న్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్