చర్ల మండలం, నాయకుల కొత్తూరు గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా, భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ పవిత్ర వేడుకలో గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు భారీగా పాల్గొని భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆలయ పరిసరాలు మంగళవాయి ద్యాల నాదాలతో మార్మోగుతూ మరింత శోభాయమానంగా ఉంది
ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమై, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారికి కంకణాలు కట్టి, తులసి దళాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకున్నారు.
కళ్యాణోత్సవం అనంతరం గ్రామస్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. సేవా భావంతో గ్రామ యువత ముందుండి ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు.
Post Views: 10











