నేటి సూర్య ప్రతినిధి: మాస శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చర్ల శివాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి చర్ల శివాలయం నుంచి శివపార్వతుల ఉత్సవ మూర్తులతో గ్రామ సందర్శన ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను చెరుకూరి వెంకట్రాజు – వనిత దంపతులు సమర్పించనున్నారు. అలాగే భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని అక్కిన రామకృష్ణ – స్వప్న దంపతులు నిర్వహించనున్నారు.
గ్రామ ఊరేగింపుకు ట్రాక్టర్ సౌకర్యాన్ని ఆశపు సాయిరాం అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
Post Views: 15











