నేటి సూర్య ప్రతినిధి:
చర్లలోని చిన్న ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భక్తి వైభవం కనువిందు చేసింది. ఒక భక్తురాలు అమ్మవారి పాదాలకు పసుపు రాసి పారాణి పెట్టినట్లుగా భావించి ఆలయ మెట్లను మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమలతో అలంకరించి తన భక్తిని చాటుకున్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ మెట్లపై పసుపు, కుంకుమలతో చేసిన ఈ ప్రత్యేక అలంకరణను చూసి భక్తి భావంతో నమస్కరించారు. భక్తురాలి ఈ ఆచారం అమ్మవారిపై ఉన్న ఆమె అపారమైన భక్తిని ప్రతిబింబిస్తుందని స్థానికులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు.
.
Post Views: 15











