నేటి సూర్య ప్రతినిధి:
ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు ప్రతీకగా నిలుస్తున్న నల్లపు దుర్గా ప్రసాద్ ప్రజల మధ్య విశేష ఆదరణ పొందుతున్నారని చర్ల మండల యువత అంటున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్న వ్యక్తిగా ఆయన పేరు నిలిచిందని అన్నారు.
మహిళలకు అండగా నిలుస్తూ, యువతకు చేయూతనిస్తూ సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా నల్లపు దుర్గా ప్రసాద్ గుర్తింపు పొందుతున్నారని ఈ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో తోడుగా నిలవడం ఆయన ప్రత్యేకత .
ఈ సందర్భంగా యువత “ప్రేమకు చిహ్నం నల్లపు, ఆప్యాయతకు అడ్రస్ నల్లపు, అనురాగానికి మరో పేరు దుర్గా ప్రసాద్” అంటూ ఆయనకు మద్దతుగా తమ ఐక్యతను వ్యక్తం చేశారు. ప్రజలకు భరోసాగా నిలిచే నాయకుడిగా నల్లపు దుర్గా ప్రసాద్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.











