నేటిసూర్య ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలంలోని లక్ష్మీ కాలనీ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జాంబవంతుని గుట్టలపై వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాలకు నేడు పందిరి ముహూర్తంతో అంకురార్పణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ఏర్పాట్లను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే ఈ జాతర ఈ నెల 8, 9, 10 తేదీలలో జరగనుంది.కావున యావత్ భక్తజనులు అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాలను తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు.
Post Views: 8










