నేటిసూర్య ప్రతినిధి: బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి అకాల మరణం చెందడం పట్ల సారపాక గ్రామపంచాయతీ 14వ వార్డు సభ్యురాలు కొమరం సావిత్రి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. మండల కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి మోహన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయం అని, ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు అని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు కొమరం సావిత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి, జర్పుల వీరమ్మ, గుగులోత్ సోనా తదితరులు పాల్గొన్నారు.
Post Views: 8










