రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. – దొడ్డి తాతారావు

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటిసూర్య ప్రతినిధి : రాష్ట్రంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్‌ను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నాయకులతో కలిసి ఆయన బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం తహసీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్పందిస్తూ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లా డుతూ, రాష్ట్రంలో వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వ సేవ చేసి, జీవితాంతం ప్రభుత్వంపై నమ్మకంతో ఎదురు చూస్తున్న ఉద్యోగులకు న్యాయం జరగాలని ఆయన కోరారు.

పెన్షన్ బెనిఫిట్స్ ఆలస్యం కారణంగా అనేక మంది మానసిక ఒత్తిడికి గురై గుండెపోటులు,ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయని, ఇప్పటివరకు 72 మంది మరణించినట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో పీఆర్సీ, డీఏలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేయలేదని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేసి, వారి బాధలను నివారించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు డి. సర్వేశ్వరరావు, పి. నరసింహరావు, బివిఎస్ఎల్ నరసింహరావు, వి. నాగభూషణం, ఆడెపు ముత్యాలరావు, ఏ. నాగేశ్వరరావు, జి.ఎస్. రాజకుమార్ పాల్గొన్నారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజీజ్, కాకి అనిల్, పంజా రాజు, గోరింట్ల వెంకటేశ్వరావు, యూత్ నాయకులు బొజ్జ సాయిప్రణీత్, గాధం శెట్టి కిషోర్ కుమార్, పాసిగంటి సంతోష్, చి. వంశీ, మహిళా నాయకురాలు బేతం చర్ల నర్సవేణి, అంకాల శ్రీనివాసరావు మరియు అనేక మంది రిటైర్డ్ ఉద్యోగులు హాజరయ్యారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :

 నోటిఫికేషన్స్