శ్రీరామనవమికి భక్తులు భారీగా కదిలి రావాలి.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం మరియు మహా పట్టాభిషేకం మహోత్సవాలు తిలకించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంబంధిత అధికారులు తమకు కేటాయించిన విధులను పగడ్బందీగా నిర్వహించి కళ్యాణ వేడుకలు దిగ్విజయంగా పూర్తయ్యేలా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
మంగళవారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణం మరియు పట్టాభిషేకం మహోత్సవాలకు చేపట్టవలసిన కార్యాచరణపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు విజయవంతంగా జరగడానికి అధికారులు కలిసికట్టుగా ఉండి విధులు ఎలా నిర్వహించారో మిథిలా స్టేడియంలో జరుగు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మరియు పట్టాభిషేకం మహోత్సవాలు జరగడానికి నెల రోజుల సమయం ఉన్నందున అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి అప్పగించిన పనులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం ప్రసాద్ పథకం కింద పనులు జరుగుతున్నందున మార్చి 20వ తేదీ నాటికి పూర్తి అయ్యేలా చూడాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. కళ్యాణం వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు వీక్షించేందుకు భక్తులు ఒక సెక్టార్ నుంచి వేరే సెక్టార్ కి వెళ్లకుండా పటిష్ట భారీకేడ్లు ఏర్పాటు చేయాలని అలాగే భక్తులకు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంచుకోవాలని దేవస్థానం ఈవో కు సూచించారు. అలాగే లాడ్జిలు బుక్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలని, అవసరమైతే పోలీస్ సహకారం తీసుకోవాలని, సెక్టర్ లలో భారీకేడ్లు నిర్వహణ ఆర్ అండ్ బి మరియు పోలీస్ శాఖ వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని భారీ కేడ్లు పటిష్టంగా జరిగేలా చూడాలని, నాసిరకంగా భారీకేడ్ల నిర్వహణ చేసే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కళ్యాణం మరియు పట్టాభిషేకం విధుల నిర్వహణకు ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించాలని అలాగే విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని, అలాగే వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా టెంపరరీ టాయిలెట్లు మరియు ఐటీసీ ద్వారా నిర్మాణం చేపట్టిన టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూడాలని,ముఖ్యంగా మంచినీటి సరఫరా విషయంలో ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేయాలని మంచినీటి సరఫరా పర్యవేక్షణకు మంచినీటి పరీక్షలు నిర్వహణకు సిబ్బందిని నియమించాలని, ప్రతి సెక్టార్కు మంచినీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని అన్నారు. మిథిలా స్టేడియంలో పర్మినెంట్ గా మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్డబ్ల్యూఎస్, దేవస్థానం డి ఈ కు సూచించారు. అలాగే వాహనాల పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యంగా అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక వాహనాలను ఎస్టీమ్ గిరీష్ పరికరాలను సిద్ధంగా ఉంచాలని అలాగే భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా రిస్కుటీములను అందుబాటులో ఉంచుకోవాలని, భక్తులు గోదారిలోకి వెళ్లకుండా పటిష్ట భారీ భద్రత ఏర్పాటుతోపాటు నాటు పడవలను గజయితగాళ్లను సిద్ధంగా ఉండేలా సంబంధిత అధికారులు చూసుకోవాలని, అలాగే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అన్నారు. భక్తులు లోతు ప్రాంతానికి వెళ్లకుండా మైకుల ద్వారా అనౌన్స్మెంట్ చేయాలని, అలాగే స్వామివారు కళ్యాణ మండపానికి విచ్చేయు చున్నప్పుడు భక్తుల రద్దీ నియంత్రణకు మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని అందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, వంతెన పై వాహనాలు ఆగిపోతే తక్షణమే తరలించేందుకు వీలుగా క్రేన్లను సిద్ధంగా ఉంచాలని, 24 గంటలు పని చేయు విధంగా అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 20 బెడ్లను సిద్ధంగా ఉండేటట్లు చూడాలని, అలాగే ఐసియు వార్డు ఏర్పాటు చేయాలని, ఎండలు ముదురు తున్నందున భక్తులకు వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, భక్తులు ఎక్కడపడితే అక్కడ చిరు తిండ్లు తినడం వలన ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని అందుకు ఎమర్జెన్సీగా 108 అంబులెన్స్ సరిపడా మందులు, అత్యవసరమైతే సిపిఆర్ చేయడానికి సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. భక్తులు బస్టాండ్ నుండి కళ్యాణం జరుగు ప్రదేశానికి రావడానికి ఆటో చార్జీలు అధికంగా వసూలు చేయకుండా పరిమితికి మించి ఆటోలో ప్రయాణించకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత ఆర్టీవో చూసుకోవాలని అన్నారు. అగ్నిమాపక సిబ్బంది కళ్యాణం జరుగు ప్రదేశాలలో ముఖ్యమైన కూడళ్లలో ఫైర్ ఇంజన్లు ఏర్పాట్లు చేయాలని, హోటళ్లలో బయట అమ్మకాలు జరిగే టిఫిన్స్ సెంటర్లలో ఆహారాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ 24 గంటలు తనిఖీ చేయాలని, దేవస్థానంలో మరియు ప్రసాదం కౌంటర్లలో అమ్మే లడ్డూలను కూడా తనిఖీ చేసి సర్టిఫికెట్ అందించిన తర్వాతనే అమ్మకాలు జరిపే విధంగా చూడాలని అన్నారు. అలాగే కళ్యాణం పట్టాభిషేకం వీక్షించడానికి వచ్చే భక్తులకు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తలంబ్రాలు, ప్రసాదం పంపిణీ విషయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని, గతం కంటే ఈసారి ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసి తలంబ్రాలు, ప్రసాదం అందే విధంగా చూడాలని దేవస్థానం ఈవో కి ఆదేశించారు. భక్తులకు సమగ్ర సమరచారము అందించేందుకు సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిపిఆర్ఓ కు ఆదేశించారు. కళ్యాణం వీక్షించడానికి వచ్చే భక్తుల కొరకు జిల్లా నలుమూలలకు వెళ్లే విధంగా బస్సులు ఏర్పాటు చేయాలని, కళ్యాణం వీక్షించడానికి ప్రముఖులు వచ్చే అవకాశం ఉన్నందున ఆర్ అండ్ బి శాఖ అధికారులు హెలిపాడ్లను తయారు చేయించి సిద్ధంగా ఉంచాలని, అలాగే పర్ణశాలలో కూడా కళ్యాణం వీక్షించడానికి భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రస్తుత భద్రాచలంలో స్వామివారి కల్యాణానికి చేస్తున్న ఏర్పాట్లు మాదిరిగానే పర్ణశాలలో కూడా చేయాలని అధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు సీతారామచంద్రస్వామి కళ్యాణము మరియు పట్టాభిషేకము అయిపోయే వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తో పాటు వివిధ శాఖల అధికారులు సిబ్బంది అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కల్యాణ వేడుకలు విజయవంతం అవ్వడానికి కృషి చేయాలని ఆయన అన్నారు.
అనంతరం ప్రాజెక్టు అధికారి బి రాహుల్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం మరియు పట్టాభిషేకం వీక్షించడానికి వచ్చే విఐపి లకు వీవీఐపీలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉన్నందున వారికి కేటాయించిన సెక్టార్లలో ఉదయం నుండే విధులలో ఉండి విజయవంతంగా జరిగేలా చూడాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ సూచనల మేరకు కళ్యాణం పట్టాభిషేకం తిలకించడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియం సందర్శించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని ఆయన అన్నారు.
అనంతరం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం మరియు పట్టాభిషేకం విజయవంతంగా జరిగేలా మా శాఖ తరపున దాదాపు రెండువేల మంది పోలీసులతో అన్నిచోట్ల ప్రతిష్ట భారీ బందోబస్తుతో పాటు భక్తులకు సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని, కళ్యాణం జరుగు మిథిలా స్టేడియం మరియు పార్కింగ్ ప్లేస్, భక్తులు సేద తీరే ప్రదేశాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మ్రినాలి శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ, డి ఆర్ డి ఓ విద్యాచందన, దేవస్థానం ఈవో దామోదర్ రావు, మరియు వివిధ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్