నేటిసూర్య ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లొ అక్రమ పశువుల రవాణా ఘటన వెలుగులోకి వచ్చింది.భద్రాచలం పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా చర్ల ప్రాంతం నుంచి భద్రాచలం మీదుగా అక్రమంగా పశువులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాహనంలో సుమారు తొమ్మిది పశువులను అత్యంత అమానుషంగా కింద పడేసి కట్టేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేసి సీజ్ చేశారు.
అక్రమ పశు రవాణాకు పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని భద్రాచలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
రక్షించబడిన పశువులను సమీప గోశాలకు తరలించే ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ పశు రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
Post Views: 5










