తేగడ వంతెన వద్ద వెలుగు చూసిన కళేబరాలు .
నేటిసూర్య ప్రతినిధి.
గోవుల, జంతువుల పట్ల క్రూరత్వాన్ని అరికట్టడానికి 1960లో ‘ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్’ (పిసిఏ) చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం గోవులను, జంతువులను హింసించడం, అక్రమంగా చంపడం నేరం. ప్రభుత్వాలు పండగల సమయాల్లో లేదా ప్రత్యేక సందర్భాలలో గో వధపై నిషేధాజ్ఞలు జారీ చేస్తుంటాయి. అయితే, ఆవాసాలు దెబ్బతినడం, వేటగాళ్ల వల్ల అడవి జంతువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. దీనిని అరికట్టడానికి అటవీశాఖ, పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది నిబంధనలు ఉల్లంఘించి మరీ గోవులను చంపడమే గాక వాటి కళేబరాలను పవిత్ర గోదావరిలో విసర్జిస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఆధారమే చర్ల మండలం తేగడ గ్రామంలొని వంతెన కింద తాలిపేరు నదిలోనినీరు గోదావరిలోకి ఏరులై పారుతూ ఉంటుంది. అందులో కొంతమంది పశువులను వధించి వాటి కళేబరాలను ఆ నీటిలో పారేస్తున్నారు. జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాల ప్రకారం వధపై నిషేధముంది. క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు జంతు వధ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలున్నాయి. చట్టాలను గౌరవించి స్వచ్ఛందంగా వధను నిషేధించాలని పలువురు అధికారులు కోరినప్పటికీ ఫలితం శూన్యమనే చెప్పవచ్చు. అక్రమ రవాణా, వధను అడ్డుకోవడానికి అధికారులు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం, పండగల సమయంలో ప్రత్యేక ఆంక్షలు విధించడం వంటివి చేస్తుంటారు. జంతువుల పట్ల కనికరం కలిగి ఉండటం, అక్రమ కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు అనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా జంతు సంక్షేమ సంఘాలకు ఫిర్యాదు చేయడం ద్వారా అడ్డుకోవచ్చు.
జల, భూగర్భ కాలుష్యం పెరిగే అవకాశం :
వాగులు, నదుల్లో జంతు కళేబరాలను పారేయడం వల్ల నీరు తీవ్రంగా కలుషితమై ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. కళేబరాలు కుళ్ళినప్పుడు వెలువడే బ్యాక్టీరియా, నైట్రోజన్, ఇతర హానికర పదార్థాలు నీటిని విషతుల్యం చేస్తాయి. దీనివల్ల కలరా, టైఫాయిడ్ వంటి జలజనిత వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఇలాంటి చర్యలను అరికట్టడానికి స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయండి మరియు సురక్షితమైన పద్ధతుల్లో కళేబరాల నిర్మూలనపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు మేధావులు కోరుతున్నారు. జంతు కళేబరాల వల్ల నీటిలో ఫేకల్ కోలిఫామ్ వంటి ప్రమాదకర బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది కలరా, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. కుళ్ళిన కళేబరాల నుంచి వెలువడే రసాయనాలు నీటిలోని ఆక్సిజన్ స్థాయిని తగ్గించి, జలచరాల మరణానికి కారణమవుతాయి. కళేబరాల నుండి వెలువడే ద్రవాలు భూమిలోకి ఇంకి, భూగర్భ జలాలను కూడా కలుషితం చేసే అవకాశం ఉంది.










