ఎవరితో పోల్చుకోకండి….. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగుంటుంది : సీఐ

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

గురుదేవ్ స్కూల్‌లో అంగరంగ వైభవంగా నమసృతి కార్యక్రమం
తగ్గేదేలే అంటున్న గురుదేవ్ విద్యార్థులు.

నేటి సూర్య ప్రతినిధి : ఎవరితో పోల్చుకోకండి… ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ దాగుంటుందని చర్ల సీఐ రాజువర్మ ఉద్బోధించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ రంగంలో ఆసక్తి కనబరుస్తున్నారో కనిపెట్టాలన్నారు. కొంతమంది పిల్లలు చదువుల్లో రాణిస్తారు… మరికొందరు క్రీడల్లో తమ ప్రతిభను చూపుతుంటారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకొని తల్లిదండ్రుల ఆకాంక్ష అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చర్ల సీఐ కోరారు. చర్ల లోని గురుదేవ్ విద్యాలయం లో మూడు రోజులపాటు నిర్వహించబడే ఈ వార్షికోత్సవ( నమసృతి) కార్యక్రమాలలో మూడవ రోజు సి.ఐ రాజు వర్మ ,ఎస్. ఐ కేశవ , నర్సిరెడ్డి గార్లు  జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సి.ఐ రాజు వర్మ మాట్లాడుతూ… విద్యార్థులు చక్కగా చదువుకోవాలంటే ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తన ద్వారా మంచి విద్యతో మీ జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో మీరు ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కళాశాలలో చదువుకున్న వారు ఎంతో మంది ప్రయోజకులయ్యారని వారి మాదిరిగానే మీరు కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండే విధంగా మీ భవిష్యత్తును సరిదిద్దుకోవాలని అన్నారు. విద్యార్థుల క్రమ శిక్షణ, ఉత్తమ ఫలితాల సాధనకై ప్రభుత్వ పాఠశాల బృందం విశేష కృషిని కరబరుస్తున్నారని తెలిపారు. చర్ల ప్రాంతం నుండి డాక్టర్లు, లాయర్లు, పోలీస్ డిపార్టు మెంటు నుండి అనేక పదవులలో ఉన్నారు కానీ చర్ల మండల ప్రాంతంలో కనీసం ఒక్కరైనా సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలని ఆ స్థాయికి ఎదగడం తన కోరిక అని తెలియజేశారు. ఎంతో అమూల్యమైన సందేశం ఇచ్చిన రాజు వర్మ , మరియు ఎస్.ఐ లు నర్సిరెడ్డి , మరియు కేశవ్ గార్లని ప్రధానోపాధ్యాయులు హెచ్ జి వి.ప్రసాద్ గారు సన్మానించారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు హెచ్. గిరి మాట్లాడుతూ… రాబోయే వార్షిక పరీక్షలకు ప్రణాళికయుతంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం చీమలమర్రి మురళి కృష్ణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం కేవలం విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయడమే కాకుండా ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య ఉన్నటువంటి చక్కని సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుందని చెబుతూ చిన్నారులను అభినందించారు. 7.8.9  తరగతుల విద్యార్థిని విద్యార్థులు 50కి పైగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకుల చేత ఆహా అనిపించారు . అలాగే చిన్నారుల కూచిపూడి,భరతనాట్యనృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చిన్నారులను అభినందించిన తల్లిదండ్రులందరికీ ప్రధానోపాధ్యాయులు పేరుపేరునా తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్