ఘనంగా పొదెం వీరయ్య 59వ జన్మదిన వేడుకలు.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

నేటిసూర్య ప్రతినిధి:  మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య 59వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నాడు చర్ల మండలం చర్ల మేజర్ పంచాయతీలో గల కాంగ్రెస్ పార్టీ, నూగూరు మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ… నిజాయితీకి మారుపేరుగా పొదెం వీరయ్య గుర్తింపు పొందారని ప్రశంసించారు. ఆయన సేవలను, రాజకీయ జీవితంలో ప్రజల పట్ల చూపిన అంకిత భావాన్ని, ముఖ్యంగా గిరిజన, పేద వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆరోగ్యం, ఆయుష్షు నిండు నూరేళ్లు ఉండాలని, ప్రజా సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు బోర పెద్ది రాజు, నూగూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు రామకృష్ణ, జవ్వాది రవిచంద్ర కుమార్, మేడిచర్ల కుమార్, చర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, కొయ్యురు సర్పంచ్ కాక రాజు, చీమకుర్తి వీరభద్రం,తోటమల్ల వరప్రసాద్, సుందరి సురేష్, చీమకుర్తి సాయి చరణ్ పండు, బండి వేణు, తాండవ రాయుడు,మాజీ ఎంపీటీసీ మడకం పద్మజ, లింగాపురం ఉప సర్పంచ్ తడికల నరేష్, లింగాపురం మాజీ సర్పంచ్ కారం రాధ, ఆవుల పుల్లారావు, ఆవుల శ్రీను, వొల్లే శ్రీకాంత్, చింతలపూడి నరసింహారావు తోటమల్ల గోపాలరావు, వార్డ్ మెంబర్లు యాలం రమేష్, వేల్పుల శివ, చల్ల పవన్, మచ్చ భద్రం, కల్లూరి నాగేశ్వర రావు, సోడి రామకృష్ణ, పర్సిక వీరభద్రం, సోడి వెంకటేశ్వర్లు, కొమరం శ్రీను కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్