హిందువులారా కదలి రండి..! కలసి రండి..! వేలాదిగా తరలి రండి…
నేటి సూర్య ప్రతినిధి: ఆత్మీయ హిందూ సమ్మేళన కార్యక్రమం పెద్ద ఎత్తున స్థానిక త్రికూట దేవాలయం ప్రక్కన ప్రదేశంలో శనివారం (ఈ నెల 20న) సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ ఒక ప్రకటన ద్వారా ఆహ్వానం పలికింది. అందులో భాగంగా చర్లలో బుధవారం శ్రీ విజయ కనకదుర్గ సేవా కమిటీ సభ్యులు అలాగే హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు కొన్ని టీములుగా వెళ్లి… హిందూ ధర్మాన్ని రక్షించ డానికి అలాగే హిందువుల యొక్క గోప్పతనాన్ని తెలుసుకు నేందుకు హిందువులారా కదలి రండి..! కలసి రండి..! వేలాదిగా తరలి రండి అంటూ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
ఆత్మీయ హిందూ సమ్మేళన కార్యక్రమంలో శృంగవృక్షం పీఠాధిపతులు నాగానంద స్వామి, 4 రాష్ట్రాల ధర్మ ప్రచారక్ భరత్ జి, నరసింహసేవాహిని ఫౌండర్ కె. కృష్ణ చైతన్య గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
సంస్కృతంలో “ధర్మో ఏవహతో హన్తి ధర్మో రక్షతి రక్షిత : తస్మోద్ధర్మన త్యజామి మానోధర్మో హాతోవధీత్. స్వధర్మే నిధనం శ్రేయః పర ధర్మోభయావహ:” (యుజర్వేదాంతర్గత, తైత్తరీయ శిక్షావళ్ళి) అంట… ఎవరైతే ధర్మాన్ని పట్టుకుంటారో అనగా మాటల్లో కాదు… ధర్మం తెలిసి ఉండటం కాదు, చేతల్లో ధర్మాన్ని, జీవితంలో ఆచరించి పట్టు విడవకుండా ధర్మాన్ని పట్టుకొని జీవిస్తారో వారిని సర్వకాల సర్వావస్తలయందు ధర్మం వారికి అంగరక్షకుడుగా నిలబడి కాపాడుతుందని అర్థం. ఎవరైతే ధర్మాన్ని తప్పి ధర్మానికి క్లేశము, హాని కలిగిస్తారో వారిని ధర్మమే నశింపచేస్తుందని సూచించింది. ఆత్మీయ హిందూ బంధువులకు స్వాగతం హిందూ బంధువులారా మన ధర్మము సనాతనము, మన ధర్మము నిత్యనూతనము… హిందుత్వం అంటే మతం కాదు. ప్రకృతితో మమేకమై జీవించే చక్కని జీవన విధానమని వివరించింది. ఈ సనాతన ధర్మ జీవన విధానానికి హాని వాటిల్లినపుడు, విపరీత వ్యాఖ్యానాలు పెరిగినపుడు ప్రతిఒక్క హిందువు గర్జించాలని పిలుపునిచ్చింది. సనాతన ధర్మ వైభవాన్ని చాటి చెప్పాలని, ఋషులు అందించిన వారసత్వ సంపదను భావి తరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రస్తుత పరిస్థితుల్లో మన సనాతన ధర్మ సమైక్యత, సమగ్రతలను, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకొనే సత్ సంకల్పంతో ” ఆత్మీయ హిందూ మహా
నిర్ణయించిందని… సమ్మేళన ఉత్సవం” నిర్వహించాలని హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ పిలుపునిచ్చింది. కావునా ప్రతి ఒక్క హిందువు ఈ కార్యక్రమానికి హాజరై తమ నిబద్ధతను తెలియజేస్తూ మన హైందవ వైభవాన్ని, హిందువుల ఐక్యతను గంభీరంగా చాటి చెప్పాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొంది. ఓ హిందూ మేలుకో, హైందత్వాన్ని అర్ధం చేసుకో – హిందువునని గర్వించు, హిందువుగా జీవించు… హిందువులారా కదలి రండి..! కలసి రండి..! వేలాదిగా తరలి రండి… అని పిలుపునిస్తోంది. మరిన్ని వివరాల కోసం 8096086222, 9347571814, 8374166814 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.











