త్రికరణశుద్ధితో పని చేస్తా
అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా….
ప్రచారంలో బేతంచర్ల నర్సవేణి స్పష్టికరణ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అందేలా కృషి చేస్తాను అని త్రికరణశుద్ధి (మనసా… వాచ… కర్మణా)తో పని చేస్తానని…అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని ప్రచారంలో బేతంచర్ల నర్సవేణి స్పష్టం చేశారు. చర్ల మేజర్ గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తనకు తెలంగాణ మలి దశ ఉద్యమకారులు సీనియర్ బీజేపీ నాయకులు జనసేన బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని పేర్కొన్నారు. ఓటర్ మహాశయులారా ఒక్కసారి ఆలోచించాలని, పదవుల కోసం రాజకీయాలు చేస్తున్న నాయకులు కావాలా… నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు కావాలో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. మీ పవిత్రమైన అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే పంచాయతీ అభివృద్ధి కోసం అనునిత్యం శ్రమిస్తానని అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల ఇబ్బందులను గుర్తించి వెనువెంటనే శాశ్వత పరిష్కారం చేస్తానని చెప్పారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం నీటి సమస్య రోడ్ల సమస్య, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు. కావున మీ అమూల్యమైన పవిత్రమైన ఓటును బ్యాట్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.











