అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రాంబాబు, బాలకృష్ణ
నేటిసూర్య ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటీఎఫ్) చర్ల మండల శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి మండల ఆఫీస్ బేరర్ ఎన్నికల ప్రక్రియ
మంగళవారం రాత్రి కాక రాంబాబు ఇంటి వద్ద చేపట్టారు. ఈ ఎంపిక కార్యక్రమం టీఎస్ యుటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బెండబోయిన మురళీ మోహన్ సమక్షంలో జరిగింది. ఈ విద్యా సంవత్సరానికి గాను మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కాక రాంబాబు, ఉయిక బాలకృష్ణలను ఎన్నుకున్నారు. అలాగే సహాధ్యక్షులుగా కే. యాదగిరి, పీ. రాధ, కోశాధికారిగా సీహెచ్. హిమగిరిబాబు, ఎఫ్ డబ్ల్యూఎఫ్ కన్వీనర్ గా ఎస్. బాలకృష్ణ, కార్యదర్శులుగా కే. శ్రీలక్మి, ఎస్. సావిత్రి, బీ. పంతులు, పీ. రాధిక, టీ. రవికిషోర్ లను ఎంపిక చేశారు. అదేవిధంగా మహిళా కన్వీనర్ గా బీ. వాణిశ్రీ, ఆడిటర్ గా బీ. సర్వేశ్వర రావు, సోషల్ మీడియా కన్వీనర్ గా టీ. జలంధర్ రావు, వీఓటీటీ మ్యాగజైన్ కన్వీనర్ గా ఎం. యాదమరాజు, అకాడమిక్ కన్వీనర్ గా ఎం. భాస్కర్, క్రీడా కన్వీనర్ గా పీ. శ్రీనులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షులు బెండబోయిన మురళీ మోహన్ వివరించారు.











