-
ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టా….
*అవినీతి లేని పరిపాలన అందిస్తా
- కిషోర్ నాయక్
ఆసియా ఖండంలోని అతిపెద్ద ఐటీసీ సంస్థ ఉన్నా… కొందరు అవినీతిపరుల చేతి వాటానికి అభివృద్ధి మాత్రం ఏమీ జరగలేదని సర్పంచ్ అభ్యర్థి కిషోర్ నాయక్ విమర్శించారు. ప్రజలు తనను వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఆశీర్వదించి విజయపధంలో నడిపిస్తే సారపాక పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధిలో ముందడుగులో ఉంటుందని భరోసానిచ్చారు. తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బు సంపాదించేందుకునేందుకు కాదని సారపాక సర్పంచ్ పోటీ చేస్తున్న కాంగ్రెస్, టిడిపి మిత్రపక్షాల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషోర్ నాయక్ అన్నారు. సారపాక పారిశ్రామిక ప్రాంతం కావడం, అందులో భిన్న ప్రాంతాల వారు కర్ణాటక, తమిళనాడు, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, కేరళ ఇలా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్న భిన్నత్వంలో ఏకత్వమైన వలస వాదులు నివసించే ఈ ప్రాంతం ఆసియా ఖండంలోని అతిపెద్ద ఐటీసీ ఉన్నా… గతంలో చేసిన అవినీతిపరుల వల్ల అభివృద్ధి జరగలేదని ఇంకా ఈ ప్రాంతంలో నీటి కోసం డ్రైనేజీల కోసం వీధిలైట్ల కోసం కనీసం చనిపోతే పాతి పెట్టడానికి ఆరడుగుల స్థలము కూడా లేక అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే పాయం మనసు చలించి పోయినది అందుకే సారపాక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి గెలిచిన కొన్ని రోజుల్లోనే రూ.10కోట్ల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీలు స మంచినీటి సమస్యల పరిష్కరించారని ఒక్క మట్టి రోడ్డు కూడా లేకోకుండా చేస్తున్నారని ఇందులో భాగంగా ఆయన శిష్యుడుగా పొంగులేటి శీనన్న అభిమానిగా నన్ను సారపాక సర్పంచిగా చేసి ఆసియా ఖండంలోనే అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చాలని పాయం వెంకటేశ్వర్లు ఆకాంక్షిస్తున్నారు . సారపాక యువత సరైన ఉపాధి అవకాశాలు లేక మత్తు పదార్థాలు, గంజాయి రవాణా చెడు వ్యసనాలు అదుపుతప్పిన శాంతి భద్రతలను తాను గాడిలో పెట్టేందుకు మీ ముందుకు వస్తున్న సారపాక సర్పంచ్ కాంగ్రెస్, టీ డీ పీ మిత్రపక్షల పార్టీలు బలపరిచిన కిషోర్ నాయక్ అనే నన్ను గెలిపించి సారపాక అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు.











