- శివరాజుల కిషోర్ జన్మదినం…. దివ్యాంగురాలికి చేయూత
- బాధితులకు వరం కావాలి… ప్రతి ఒక్కరి పుట్టినరోజు వేడుకలు….
మిత్రుడి పుట్టిన రోజు నాడు బాధితుల కష్టాలు తీర్చడం నిజంగా గొప్ప విశేషమని పలువురు అభినందనలు ప్రశంసల వర్షం కురిపించారు. సేవా భావం, మార్గదర్శకుడు, అపారమైన ఆధ్యాత్మిక భావం గల సీనియర్ పాత్రికేయులు శివరాజుల కిషోర్ కుమార్ జన్మదిన సందర్భంగా సంబాసర్తీ వెంకట్ సారమ్మ దంపతుల కుమార్తె దివ్యాంగురాలు మహాలక్ష్మీకి 25కిలోల బియ్యం, నిత్యవసర సరుకులను మిత్ర బృందం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు అంబోజు సతీష్ మాట్లాడుతూ… పుట్టినప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లేకుండా గత 14 ఏళ్లుగా మంచానికే పరిమితమైందని, వాళ్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మా మిత్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిరు సాయం అందించడం జరిగిందన్నారు. అనంతరం యువ న్యాయవాది పరిటాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ… మిత్రుల పుట్టిన రోజు, పెళ్లి రోజు అంటూ వృధా ఖర్చు పెట్టకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రతి ఒక్కరి పుట్టినరోజు వేడుకల సమయంలో బాధితుల అవసరాలను తీరిస్తే అందరికీ వరంలా మారుతుందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు మద్ది లక్ష్మీనరసింహారెడ్డి, ముసలి సతీష్, బొబ్బిలి పాటి రవికిరణ్, రామలక్ష్మణ్, మహేష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.











