శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సేవా కమిటీ ఆధ్వర్యంలో భవానిలచే పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమం చర్లలోని ఎంపీడీఓ కార్యలయం ఎదురుగా గల చిన్న ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ పడి పూజా కార్యక్రమంలో భవానీ మాల దారులతో పాటు కోరం నాగరాజు దంపతులు, యడారి రమేష్ దంపతులు, పల్లపు సమ్మయ్య దంపతులచే ఆలయ అర్చకులు దుర్గాప్రసాద్ అమ్మవారికి పూజా జరిపించారు. పడి పూజా కార్యక్రమంలో భవానిలు, అయ్యప్ప మాల ధరించిన స్వాములు, భక్తులు, సేవా కమిటీ సభ్యులు రౌతు నరసింహారావు ,చల్లకోటి వాసు, ఋషి కుమార్, శంకరాచారి, గోసంగి నరేంద్రభవాని, ప్రభావతి, బేతంచర్ల ధనలక్ష్మి, వానపల్లి వరలక్ష్మి ,వీస్సా నరసమ్మ, కొంగురు కళావతి, కృష్ణకుమారి ,ఎడారి పృథ్వి, సాంబశివరావు, కాకర్ల శివ స్వామి, ఎడారి వినయ్, తదితరులు పాల్గొన్నారు.











