పీసా చట్టం నియమాలు గుర్తుకు రావడం లేదా…?
గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సూటి ప్రశ్న
పంచాయతీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు గిరిజన షెడ్యూల్డు ప్రాంత పంచాయతీరాజ్ పీసా చట్టం 1998, నియమాలు 2011 రూల్స్ గుర్తుకు రావడంలేదా అని ప్రభుత్వానికి గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ బుధవారం నాడు ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్న లేవనేత్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లపై చేయబడిన 50శాతం పరిమితిని తొలగించడానికి రాజ్యాంగ 81వ సవరణ చట్టం 2000లో చేయబడిందని గుర్తు చేశారు. గిరిజనుల హక్కులు, భూ సమస్యలు వంటి వాటిపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పీసా చట్టం 1998 నియమాలు 2011 రూల్స్ ప్రకారం షెడ్యూల్ ప్రాంత సర్పంచ్, వార్డు నెంబర్ల నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు
Post Views: 16











