సమర్ధుడైన అభ్యర్థుడికి ఓటు వేయండి.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

సమర్ధుడైన అభ్యర్థుడికి ఓటు వేయండి… హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్.

నేటి సూర్య ప్రతినిధి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక లో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ (reg 209/24) సభ్యుల సమావేశం దుగ్గంపూడి వెంకటరెడ్డి అధ్యక్షతన  నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మానవ హక్కుల భంగం కలిగిన, ప్రజా సమస్య ఏదైనా ఎత్తి చూపించడానికి సమస్య పరిష్కారం కోసం హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ పనిచేస్తుందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో గ్రామాలకి పనిచేసే వ్యక్తిని సమర్థున్ని ఎన్నుకోవాలని గత ఆరు సంవత్సరాలుగా సారపాక గ్రామానికి ఎన్నికలు లేకపోవడం… గ్రామం అభివృద్ధి జరగటంలో వెనక బడి ఉన్నాదని అన్నారు. బూర్గంపాడు మండల వ్యాప్తంగా 18 గ్రామపంచాయతీలలో జరుగుతున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా తమ ఆయుధమైనటువంటి ఓటు ఆయుధాన్ని సరియైన సమర్థుడైన వ్యక్తికి ఓటు వేసి మంచి నాయకున్ని ఎన్నుకోవాలని సూచించారు. పోటీ చేసే నాయకులందరూ కూడా మాటపై నిలబడాలని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కలబొల్లి మాటలు కలబులి హామీలు ఇవ్వవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డోంకన చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు దామెర ఆదినారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి ఉర్లగొండ వీరన్న, జిల్లా లీగల్ అడ్వైసర్ రంగు రామచంద్రరావు, సెగ్మెంట్ ప్రెసిడెంట్ కారం హనుమంత్, దుర్గ ప్రసాద్, వెంకట నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్