నేటి సూర్య ప్రతినిధి: అటవీ ప్రాంత గ్రామాలకు చెందిన ఆదివాసీ విద్యార్థుల చదువులకు తమ సహకారందించడం విశేషమని వన వాసీ కళ్యాణ పరిషత్ నిర్వాహకులు తెలిపారు. బుధవారం వన వాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయంకు విజయవాడ వాస్తవ్యులు కొత్త సరళ – కృష్ణ దంపతులు వారి మనవరాళ్లు ఆనియా – అన్నిక జన్మదినం సందర్భంగా 50కిలోల బియ్యం, ఉదయం టిఫిన్, రాత్రి భోజన ఏర్పాట్లుచేసి తమ ఔదార్యం ప్రదర్శించారు. చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన ప్రముఖ రైతు దివంగత పరుచూరి వెంకయ్య కుమార్తె అయిన సరళ దంపతులు ఇతర ప్రాంతంలో స్థిరపడిన వీరి మనసంతా చర్ల పైనే ఉంటుందనడానికి వీరు ప్రతి ఏటా లింగాపురం పాఠశాల విద్యార్థులకు అనేక సౌకర్యాలను కల్పించడమే నిదర్శనం. ఇదే క్రమంలో ఈ ఏడాది మారుమూల అటవీ ప్రాంత గ్రామాలకు చెందిన ఆదివాసీ విద్యార్థుల చదువులకు తమ సహకారందించడం విశేషం. ఈ సందర్భంగా ఆనియా – అన్నికల తల్లిదండ్రులు శృతి, సూరజ్, కార్యక్రమానికి సహకరించిన పరుచూరి వెంకట నర్సయ్య, మనోహర్ ప్రసాద్ లకు నిలయ కమిటీ కృతజ్ఞతలు తెలియచేసింది. ఈ కార్యక్రమంలో వన వాసీ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, వన వాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ, నిలయ కమిటీ అధ్యక్షుడు తాటి పాపారావు, కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు గోగికార్ రామ లక్ష్మణ్, సహ ఉపాధ్యక్షులు వేములపల్లి ప్రవీణ్ బాబు, బందా స్వరూప, పోలిన రమాదేవి, ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న కుమారి, లవన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.











