చర్ల మండలంలో అభివృద్ధికి నాంది పలికిన ఎమ్మెల్యే.—— పనుల జాతర -2025 విజయవంతం

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

ప్రజల నాడులు పట్టి రోగం ఏముందో ఇట్టే పసిగట్టే నైపుణ్యత గల డాక్టరే ప్రజా ప్రతినిధి అయితే దాని ప్రతి ఫలం వేరే లెవల్లో ఉంటుందనడానికి ఇదో నిదర్శనం… పలువురికి ఆదర్శ ప్రాయం అని చెప్పవచ్చు. భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి తన ధ్యేయంగా పని చేస్తోన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నిజంగా అభినందనీయుడే అని చెప్పాలి. పనుల జాతర – 2025లో భాగంగా చర్ల మండలం రాళ్లగూడెం, అంగన్వాడి భవనం శంకుస్థాపన దేవరపల్లి అంగన్వాడి భవనం శంకుస్థాపన, తేగడ గ్రామం జంగాలపల్లి సీసీ రోడ్డు, చర్ల మండలం పంచాయతీ పరిధిలోని నందు హోటల్ గల్లీ సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పంటాభివృద్ధి, భూ సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు భాగంగా, చర్ల మండల కేంద్రంలోని చాలా అభివృద్ధి కార్యక్రమాలకు పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా తనను గుర్తుచేసుకుంటే లేదా స్థానిక నాయకులు, కార్యకర్తల ద్వారానైనా తనకు కబురు పెడితే ఆయా సమస్యలు పరిష్కారం దిశగా పని చేస్తానని స్పష్టం చేశారు. ఇంకా తనను నేరుగా సంప్రదించాల్సి వస్తే ఎలాంటి బెరుకు, భయం లేకుండా తనను కలుసుకోవచ్చన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్