చర్ల, నేటిసూర్య న్యూస్: గిరిజన విద్యార్దులకు విద్యనం దించేందుకు దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో వనవాసీ విద్యార్థి నిలయాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా సంఘటనా కార్యదర్శి కోరం సూర్యనారాయణ వివరించారు. గిరిజనుల అభ్యున్నతి కొరకే వనవాసీ కళ్యాణ పరిషత్ ఏర్పాటయిందన్నారు. గురువారం నాడు చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి యాలం నవిత – తిరుపతిల కుమార్తె దర్శిక ద్విజ జన్మదినం సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల్లో చైతన్యం నింపేందుకు వనవాసీ సేవలను అందచేస్తున్నట్లు వివరించారు. ఛత్తీస్‌ఘడ్ లోని జస్ పూర్ లో ఏడుగురు విద్యార్ధులతో ప్రారంభమైన సంస్ద నేడు దేశ వ్యాప్తంగా 256 విద్యార్థి నిలయాలను ఏర్పాటుచేసి వేలాదిమంది విద్యార్దులకు విద్యనందిస్తోందని వెల్లడించారు. ఇందుకు గాని గిరిజన అభ్యన్నతి కొరకు ఏడు లక్షల మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా తమ సేవలను అందచేస్తున్నారని వివరించారు. పంచాయతీ కార్యదర్శి యాలం నవిత మాట్లాడుతూ… గిరిజనుల అభ్యున్నతి కొరకు సంస్థ చేస్తున్న సేవలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. విద్యతోపాటు జాతీయ భావం, దేశభక్తి పెంపొందించడం సంతోషకరమని పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్ధుల నడవడిక, క్రమ శిక్షణ తమను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. విద్యార్ధులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగపర్చుకొని చదువుపై శ్రద్ధ వహించడం ద్వారా ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ మాట్లాడుతూ… విద్యార్థి నిలయం పేద గిరిజన విద్యార్దులకు అందిస్తున్న సేవలను గుర్తించి దాతలు సహకారం అందించడం సంతోషకరమని పేర్కొన్నారు. విద్యార్ధుల చదువులకు సహకరించేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. విద్యార్థి నిలయంకు బియ్యం, కూరగాయలు అందచేసిన దాతలకు నిలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నిలయ కమిటీ ఉపాధ్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న కుమారి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.











