డిప్యూటేషన్లను విరమించకుంటే స్కూల్ కు తాళం వేస్తాం.

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

డిప్యూటేషన్లను విరమించకుంటే స్కూల్ కు తాళం వేస్తాం

ఇప్పుడిప్పుడే విద్యాభివృద్ధికి బ్రేకులా..?

మాజీ సర్పంచ్ కారం కన్నారావు హెచ్చరిక

చర్ల, నేటిసూర్య న్యూస్: ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను విరమించకుంటే స్కూల్ కు తాళం వేస్తామని, ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోన్న విద్యను డిప్యూటేషన్ల పేరిట బ్రేకులు వేస్తారా అని మాజీ సర్పంచ్ కారం కన్నారావు నిలదీశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల బట్టిగూడెం ఎంపీపీఎస్ స్కూల్లో పని చేస్తున్న టీచర్స్ నీ డిప్యూటేషన్ కింద వేరే స్కూల్లో పంపించడానికి చూస్తున్నారని మండి పడ్డారు. ఈ ఆదివాసి గ్రామంలో ఇంతకు ముందు ఏ టీచర్ లేక దిక్కు లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కొంతమంది పుణ్యమా అని విద్యా బుద్ధులు చెప్పడం మొదలుపెట్టారు. విద్యార్ధులకు సరైన విద్యా అందలేని నేపథ్యంలో ఈ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నా టీచర్స్ వల్ల ఈ ఆదివాసి బిడ్డలకు ఇప్పుడిపుడే విద్యా ఫలాలు అందాయన్నారు. ఈ క్రమంలో టీచర్స్ డిప్యుటేషన్ పేరుతో వేరే స్కూల్ కి పంపడం వల్ల ఈ ఆదివాసి పిల్లలు పరిస్థితి ఏంటని..? వారి భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ప్రజలు తర్జన భర్జన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్కూల్ లో 25 మంది పిల్లలు ఉండే ఇద్దరు టీచర్స్ నిబంధన ఉన్నా ఈ నిబంధనకు విరుద్ధంగా డిప్యుటేషన్ పంపించడం గ్రామస్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ డిప్యుటేషన్ విరమించకుంటే స్కూల్ కి తాళం వేసి ఉద్యమం చేపడ తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు మీడియం స్వామి, కారం రామ రావు, మీడియం లక్ష్మయ్య, గట్టుపల్లి ఎర్రయ్య, పర్సిక బాబు రావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్