చర్ల, నేటిసూర్య న్యూస్: చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వర్షాకాల సీజనల్ వ్యాధులతో బాధపడుతోన్న రోగులను రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు పరామర్శించి వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. శనివారం కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని కొన్ని సామాజిక సేవల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా మొదట ఆయన చర్లలో కృష్ణాష్టమి వేడుకలకు హాజరై అక్కడ ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ఉట్టి కొట్టి స్థానికులను అలరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వివిధ రకాల వ్యాధులతో బాధపడుతోన్న రోగులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పళ్ళు, బ్రెడ్ లు పంపిణీ చేశారు. ఎవరికి ఏమైనా అవసరం ఏర్పడితే తాను ఎల్లప్పుడు సేవ చేయడానికి ముందుంటానని భరోసానిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో పోలిన లంక రాజు, సోయం రాజారావు, కాకి అనిల్, పంజా రాజు, గార చంటి తదితరులు పాల్గొన్నారు.











