నేటి సూర్య ప్రతినిధి : ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా శనివారం వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్థి నిలయ విద్యార్థులకు పండ్లు పంపిణీ జరిగింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు వాస్తవ్యులు గుది వెంకట్రావు దంపతులు (ప్రాంత సహా మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత కూతురు తరపు వియ్యంకులు) ముందుకు వచ్చి బొప్పాయి, అరటి పళ్ళు, బిస్కెట్స్, ప్యాకెట్స్, చాక్లెట్స్, బన్స్ అందజేశారు. ఈ సందర్భంగా వనవాసి బాధ్యులు మాట్లాడుతూ… నిరుపేద, అనాధ పిల్లల పట్ల దయాగుణం కల వారు ఎవరికి తోచింది వారు ఇస్తున్నారని , వీరిని మిగతా వారంతా కొంతలో కొంతైనా దాన ధర్మాలు చేస్తే నిరుపేదలకు అండదండ ఉంటుందని చెప్పుకొచ్చారు. అనంతరం నిలయ సమితి సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
Post Views: 108











