చర్ల, నేటిసూర్య న్యూస్: భక్తాంజనేయ స్వామికి మకర తోరణం సమర్పించుకొని డాక్టర్ కాంత్ దంపతులు దాతృత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం డాక్టర్ గీతానంద పార్వతి కాంత్ ,ఇందిరా ప్రవల్లిక దంపతుల (పెద్దాడ సూర్య త్రినాథ వెంకట నరసింహ కుమార్ ఆశాలత దంపతుల ప్రథమ పుత్రుడు) మ్యారేజ్ డే సందర్భంగా పాత చర్లలో గల శ్రీ సీతారామ లక్ష్మణ సమేత భక్తాంజనేయ స్వామి దేవాలయానికి ఇరువైపులా శంకు చక్రాలు తీర్చిదిద్దిన అందమైన రామచిలుకల హంగులతో కూడిన మకర ధ్వజం లేదా మకర తోరణాన్ని సమర్పించారు. తాను ఎంత చదువులు చదివినా…. ఎంత పరపతి సంపాదించినా స్వ గ్రామం పై ప్రేమానురాగాలు తగ్గవని నిరూపించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు ఆవు పాలతో సంప్రోక్షం చేసి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత భక్తాంజనేయ స్వామి వారికి మకర తోరణాన్ని అలంకరించారు. ఈ కార్యక్రమంలో మచ్చ వీర్రాజు నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు పంజా రాజు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.











