సమాజ సేవలో మేము సైతం…

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

శ్రీ సరస్వతి విద్యానికేతన్ విద్యార్థుల దాతృత్వం.

మీ కోసం మేమున్నాం టీంకు రూ.1,520లు అంజేత.

చర్ల , నేటిసూర్య న్యూస్: విద్యార్థులు వినూత్నమైన ఆలోచనతో మానవత్వాన్ని చాటుకున్నారు. మండల కేంద్రమైన చర్లలో నిస్సహాయక స్థితిలో ఉన్న నిరుపేదల ఆకలిని తీర్చేందుకు వారు పోగు చేసుకున్న డబ్బులను తీసుకొచ్చి మీకోసం మేమున్నాం టీంకు అందజేశారు.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. మండల పరిధిలోని తేగడ గ్రామానికి చెందిన శ్రీ సరస్వతి విద్యానికేతన్ కు చెందిన విద్యార్థులు శనివారం మీ కోసం మేమున్నాం టీంకు వారు చేసే సేవా కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం అవుతామని వారు పోగు చేసుకున్న రూ. 1,520లను అందజేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. చిన్న వయస్సు నుంచే విద్యార్థుల్లో మానవత్వాన్ని పెంపొందించాలనీ, పొరుగు వారికి తోచిన సాయమదించాలనే ఓ మహా సంకల్పానికి తెరలేపారు ఆ పాఠశాల చైర్మన్ లిఖిత. విద్యార్థినీ విద్యార్థులలో ఈ విషయం నాటుకుపోవాలనే ఉద్దేశంతో జనవరి ఒకటో తేదీన ఓ డొనేషన్ బాక్స్ ను పాఠశాలలో ఏర్పాటుచేసి, విద్యార్థులందరి చేత అందులో సేవింగ్స్ ను కూడబెట్టగా అవి మొత్తం రూ. 1,520లు జమా అయ్యాయని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన ఆ టీం నిర్వాహకులు లయన్ నీలి ప్రకాష్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చిన్నారుల్లో ఇలాంటి ఆలోచన వచ్చేందుకు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ సరస్వతి విద్యానికేతన్ తేగడ పాఠశాల తమ సొంత ఆలోచనలతో రూపొందించిన 2025 క్యాలెండర్ ను నీలి ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ లో వినూత్న రీతిలో అవగాహన కల్పించే అంశాలు జోడించి విద్యార్థుల్లో జాగరూకత మేల్కొలిపే విధంగా ఉన్నాయని ఆయన అభినందించారు. వీరి క్రియేటివిటీకి తాము దాసోహం అయ్యామని, వీరి భవిష్యత్తులో వెలుగులు నిండాలని, వీరంతా తమ జీవితంలో శిఖరాగ్రాలు అధిరోహించాలని ఆకాంక్షించారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్