కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ కార్మికులు కార్మికులు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ఆయా వర్గాలకు కేటాయింపులు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం స్వామి డిమాండ్ చేశారు. నేడు పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ కార్మికులకు, రైతులకు, కార్మికులకు అనుకూలమైన ప్రతిపాదనలు చేయాలని కోరుతూ భద్రాచలం పట్టణం అంబేద్కర్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గడ్డం స్వామి మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దుచేసి కేంద్రం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మిక సంక్షేమానికి ప్రత్యేక నిధి కేటాయించాలని,ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని, రైతాంగానికి కనీసం మద్దతు ధర కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడుతూ సామాన్య ప్రజల జీవితాలను గాలి వదిలేస్తున్న కేంద్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో చావు దెబ్బ తగిలిందని ఈసారైనా ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టాలని అన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక కర్షక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా నేరు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు అజయ్ కుమార్, రాము మరియు కార్మికులు పాల్గొన్నారు..











