చర్ల, నేటిసూర్య న్యూస్: ప్రతి ఏటా దాదాపు అన్ని పాఠశాలల్లో వార్షికోత్సవ వేడుకలు సాదాసీదాగా పిల్లలకు ఆట, పాటలు, తదితర క్రీడలతో మనోరంజం చేసేవిగా సాగి పోతుంటాయి. కానీ ఈ విద్యాలయంలో మాత్రం విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక స్పృహ పెంపొందించే విధంగా నిర్వాహకులు ప్రయత్నం చేస్తుంటారు. ఈ న్కూల్ పేరు వినని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలోని మారుమూల మండలమైన చర్లలో విజయవంతంగా కొనసాగుతోన్న విద్యాలయమే… “గురుదేవ్”. ఈ విద్యాలయంలో కూడా వార్షికోత్సవ వేడుకలు జరుగుతుంటాయి. అన్నీ పాఠశాలల్లో జరిగే విధంగా కాకుండా కొంచెం ప్రత్యేకంగా, వినూత్నంగా నిర్వహించేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంటారు ఈ న్కూల్ ప్రధానోపాధ్యాయులు హెచ్ జీవీ. గిరి. ఈయన క్రియేటివిటీని చూసి మిగతా పాఠశాలల యాజమాన్యాలు సైతం ముక్కున వేలేసుకుంటారంటే నమ్మశక్యంగా లేదు కదూ.. కానీ ఇది నిజమని స్థానిక విద్యావంతుల అభిప్రాయం. ఈ సారి కూడా “గురుదేవ్ విద్యాలయంలో వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు “నమస్కృతి” ప్రోగ్రాంను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం విద్యార్థులే తమ తమ తల్లిదండ్రులను స్కూల్కు సాదరంగా ఆహ్వానించడమే. విద్యాలయానికి చేరుకున్న తల్లిదండ్రులకు ప్రత్యేకంగా గౌరవం, సుస్వాగతం పలకడంతో తల్లిదండ్రుల్లో ఎనలేని ఆనందం వారి సొంతం కావడంతో “గురుదేవ్” యాజమాన్యంపై గౌరవం పెరుగుతుందని పిల్లల అమ్మనాన్నల కామెంట్స్ దీంతో యాజమాన్యం ప్రతి ఏటా తనదైన మార్క్ ను జిల్లా వ్యాప్తంగా సృష్టించుకోగలిగింది. మొదటి రోజైన శుక్రవారం ఈ “నమస్కృతి” కార్యక్రమాన్ని ఎంఈఓ పరిటాల వెంకట రమణ, విలేఖర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన, లోగోను ఆవిష్కరించి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఈవో మాట్లాడుతూ…. గురుదేవ్ విద్యాలయం వార్షికోత్సవంలో “నమస్కృతి”ని తల్లిదండ్రులకు అంకితం చేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని, విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే విధంగా ఉందని, విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని విద్యార్థులను మనసార ఆశీర్వదించారు. రెండో రోజైన శనివారం సర్సరీ నుండి రెండవ తరగతి వరకు చిన్నారులు సందేశాత్మకమైన కార్యక్రమాలతో పాటు అలరించే ఆటపాటలతో అందరినీ అలరించారు. మూడవ రోజైన ఆదివారం నాడు 76వ గణతంత్ర దినోత్సవం
సందర్భంగా ప్రధానోపాధ్యాయులు హెచ్ జీవీ. ప్రసాద్ తిరంగా జెండాను ఆవిష్కరించారు. విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దలు
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురుదేవ్ విద్యాలయంలో ఘనంగా జరిగిన పాఠశాల వార్షికోత్సవం “నమస్కృతి” మూడు రోజుల పాటు విజయవంతంగా సాగేందుకు సర్వశక్తులు ఒడ్డిన స్కూల్ తోటి ఉపాధ్యాయులు, స్టాఫ్ కు హెచ్ ఎమ్ గిరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చివరి రోజున 3 నుంచి 5వ తరగతి వరకు చిన్నారులు సమాజంలో చోటు చేసుకుంటున్న ఘోరాలను అరికట్టేందుకు ప్రజలను మేల్కొలిపేందుకు తీర్చిదిద్దిన సన్నివేశాలు చూపరులను ఔరా అనిపించాయి. ఫలితంగా విద్యార్థుల్లో స్ఫూర్తి, అంకిత భావం పెరగడాన్ని తల్లిదండ్రులు కళ్లారా చూసి ఆనంద భాష్పాలు కారుస్తున్న దృశ్యాలు పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంచనాలు వేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఇలాంటి కనుల విందుగొలిపే కార్యక్రమాలను చూసిన ప్రతి ఒక్కరి నోట “గురుదేవ్” విద్యాలయం హెచ్ జీవీ. గిరిపై మరింత అభిమానం పెరిగిందని, అందరూ ఆయన్ను భుజం తట్టి శభాష్ అని వెళ్లడం విశేషమే అని చెప్పవచ్చు. “నమస్కృతి”తో ఇతర పాఠశాలల యాజమాన్యాలకు ఆలోచింపజేసేలా… ఇలా కూడా చేయవచ్చా అని అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచేశారు గురుదేవ్ విద్యాలయం హెచ్ఎం హెచ్ జీవీ. గిరి అని చెప్పక తప్పడం లేదనిపిస్తోంది.











