తల్లిదండ్రులకు ‘సమస్కృతి’కి ఆహ్వానం. — ప్రతి ఏటా కొత్త కాన్సెప్ట్ తో “గురుదేవ్”

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్ల, నేటిసూర్య న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలోని మారుమూల మండలమైన చర్లలో స్థాపించబడిన “గురుదేవ్” విద్యాలయం క్రియేటివిటీ రోజురోజుకు కొత్త హంగులతో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కొత్త దిశా నిర్దేశం ఇస్తుందని చెప్పక తప్పదు. ఈ స్కూల్లో ఏదో ఒక నూతన కార్యక్రమాన్ని ప్రణాళికాబద్దంగా రూపొందించి దాన్ని విజయవంతం చేసేంత వరకు నిద్రపోరు ఈ విద్యాలయం వ్యవస్థాపకులు, స్టాఫ్. అందులో భాగంగానే ఈ సారి కూడా ప్రతి ఏటా జరిగే స్వయంగా విద్యార్థులచే తమ తమ తల్లిదండ్రులను తమ స్కూల్ కు రప్పించి వారిని తమ కళా నైపుణ్యతను ప్రదర్శించి వారిచే ఔరా అనిపించుకోవడం వీరికి షరా మామూలుగా మారిందనడంలో అతిశయోక్తి కాదేమో. అందుకే ఈసారి కూడా ‘నమస్కృతి’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 25 (శనివారం) తేదీ నాడు ఉదయం 9.30గంటలకు ప్రారంభమై మూడు రోజులపాటు అనగా 27వ తేదీ వరకు స్కూల్ వార్షికోత్సవాన్ని కూడా జోడించి అందరినీ అలరింపజేసి వారిచే చప్పట్లు కొట్టించుకునే కార్యక్రమమే ఈ “నమస్కృతి” అని చెప్పవచ్చు. ఈ ప్రోగ్రాంలో నర్సరీ నుంచి టెన్త్ వరకు విద్యార్థినీ, విద్యార్థులు రకరకాల వేషధారణలు ధరించి, ఆట, పాటలు, డ్యాన్స్లతో అందరినీ మైమరిపించేందుకు వారిని స్టేజీ ఎలాంటి వణుకు, బెరకు లేకుండా నిర్భయంగా తమ ప్రదర్శనలు ఇచ్చేలా వారిని తయారు చేసేందుకు ఆ విద్యాలయ స్టాఫ్, హెచ్ఎం హెచ్ జీకే గిరీ ప్రోత్సాహం, అకుంఠిత దీక్ష దాగుంది. దీంతో ఈ విద్యాలయంలో చదివే పిల్లలు ఎక్కడికెళ్లినా వారు విజయం సాధిస్తారనే నమ్మకం. ధైర్యం తల్లిదండ్రుల్లో దృఢంగా నాటుకుందంటే అతిశయోక్తి కాదేమో మరీ. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలను చూసేందుకు పిల్లల తల్లిదండ్రులు తమ తమ బంధుమిత్రులను సైతం ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. దీన్ని తిలకించేందుకు ఆ మండల ప్రముఖులు, ఇతర పాఠశాల పిల్లలు సైతం ఉత్సుకతతో ఉన్నారని అర్ధమవుతోంది. ఏది ఏమైనా గురుదేవ్ పిల్లలా…. మజాకా అనే రీతిలో సాగే “నమస్కృతి” నూటికీ నూరు శాతం సక్సెస్ కావాలని ఆ విద్యాలయ హెచ్ఎం గిరి ప్రసాద్, అకడమిక్ కో‌ఆర్డినేటర్స్ మల్లాది సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ గార్లు మనసారా కోరుకుంటూ అందరినీ ఆహ్వానిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్