ఆడపిల్లలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలి
మగవారి కన్నా ఆడవారు అన్ని రంగాల్లో ముందుండాలి
జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జేఎం స్వర్ణ లత లెనినా
కొత్తగూడెం, నేటిసూర్య న్యూస్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భేటీ బచావో భేటీ పడవో 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి.జాతీయ బాలికల దినోత్సవం ని పురస్కరించుకొని పి జి ఎస్ డబ్ల్యు ఆర్ జెసి నవభారత్ లో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డి ఎల్ ఎస్ ఏ సెక్రెటరీ భానుమతి పిల్లలకు జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఆడపిల్లలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆడపిల్లలు లేనిదే సమాజం లేదని అలాగే మగవారు కన్న ఆడవారు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారని తెలిపారు.జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి శ్రీమతి జేఎం స్వర్ణ లత లెనిన మాట్లాడుతూ బాలల హక్కులు, బాల్య వివహాలు, న్యూట్రిషన్ ఫుడ్ గురించి వివరించారు ఐసిడిఎస్ సీడీపీవో లక్ష్మీ ప్రసన్న విద్యార్థులకు బాలిక దినోత్సవ శభాకాంక్షలు తెలిపి బాలల చట్టాలను బాలల అక్రమ రవాణా, హెల్ప్ లైన్ నంబర్స్ 181,1098 గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మిథిలా మాట్లాడుతు బాలికల విద్య మహిళా సమానత్వ మహిళా సాధికారత గురించి అన్ని రంగాలలో బాలికలు ముందు వుండాలి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఎ సభ్యులు నిరంజన్.ఐసీడీఎస్ సూపర్వైజర్లు రమాదేవి, దీప, సుధతి, కవిత. మాధవి,రత్న కుమారి,అశోక మాలతి., సి డబ్ల్యు సి మెంబర్ సాధిక్ పాషా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హరికుమారి వారి సిబ్బంది మహిళా సాధికారత కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ సంతోష రూప జెండర్ స్పెషలిస్ట్ జహేద, సాహితి, ఎస్ ఎఫ్ ఎల్ స్వాతి, అకౌంటెంట్ ప్రియాంక, సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ శుభ శ్రీ, రాజమని, సునీత, శారద, వెంకట లక్ష్మీ, పాఠశాల ఉపాద్యాయులు , విద్యార్థులు తదితరులు పాల్గోన్నారు.











