చర్ల నుండి వెంకటాపురం వైపు వెళ్లే వాహనదారులకు సిఐ రాజు వర్మ కొన్ని సూచనలు చేసి అప్రమత్తం చేశారు. గురువారం రాత్రి మీడియా మిత్రులకు ఫోన్లు చేసి, వాట్సాప్ గ్రూపుల్లో ప్రజల సంక్షేమం కోరుతూ… ఈ కల్వర్టు పగుళ్లించిందని తెలియజేశారు. చర్ల – వెంకటాపురం ప్రధాన రహదారి యాకన్నగూడెం గ్రామం వద్ద కల్వర్టు డ్యామేజ్ అయ్యింది. అటువైపు వెళ్లే వాహనాలకు రహదారి పూర్తిగా అధ్వాన్నంగా తయారైందనే చెప్పారు. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాలు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ అటువైపు వెళ్లి ఇబ్బందులకు గురి కావొద్దని ముందస్తు హెచ్చరికలు జారిచేశారు. ఏది ఏమైనా విషయం తెలియగానే ప్రజల ప్రాణాలు కాపాడటం తన బాధ్యత గుర్తుకు రావడం సిఐ రాజు వర్మకే చెల్లిందని పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
Post Views: 178











