బాధ్యత మరిచిందెవరు… సమస్య తీర్చెదేవరు..?…..వెలగని హైమాస్ట్ లైట్లు…

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చీకట్లో ప్రమాదాల బారీన ప్రజలు

మూడు శాఖల అలసత్వం… అంధకారంలో ప్రజానీకం…

బూర్గంపాడు .నేటిసూర్య న్యూస్ : అక్కడ చీకటి కాగానే ఆ ప్రాంతమంతా అంధకారంలో మగ్గిపోతుంది.. అక్కడ నుంచి వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి… అటు పక్కనే దక్షిణ అయోధ్య అని పిలువబడే శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉండటంతో భక్త సమూహం కూడా రాకపోకలు సాగిస్తుంటుంది. రాత్రి సమయంలో చిమ్మ చీకట్లో మధ్య వాహనదారులు ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనంతటికీ కారణం హైమాస్ట్ వెలుగులు ప్రసరింపక పోవడమేనని చెప్పవచ్చు దీన్ని పరిష్కరించకపోగా.. ఇది తమ బాధ్యత కాదంటూ ఒక శాఖ మరొక శాఖకు తోసేయడం ఇక్కడ విస్మయానికి గురిచేస్తోంది. వివరాలిలా ఉన్నాయి…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు వెలగకుండా అలంకార ప్రాయంగా మారాయి. హైమాస్ట్ లైట్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకటితో ప్రజలకు, వాహనాదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ, మున్సిపల్, గ్రామ పంచాయతీ పోలీసుశాఖ వారు దృష్టిసారించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేషనల్ హైవే వారిని అడిగితే… మున్సిపాలిటికి, మునిసిపాలిటీ వారిని అడిగితే గ్రామ పంచాయతీ అధికారుల బాధ్యత అంటూ దాట వేస్తున్నారు. ఇలా టైం పాన్ చేస్తున్నారే తన లైట్లు వెలిగించే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తేనే ఆ లైట్లు వెలిగిస్తారా అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి. నిమ్మకు నీరు ఎత్తినట్లు అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా హైమాన్ స్తంభం కనిపిస్తూ ఉంది. అధికారులు ఉన్నారా…? లేనట్టా..? అధికారులారా ఇంత నిర్లక్ష్యం తగునా… ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే అధికారులు ఇదే ప్రధాన బాధ్యతని గుర్తించండి. ప్రమాదం జరిగితే హడావుడి చర్యలు చేపడితే సరిపోతుందా ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించాలని మండి పడుతున్నారు. ఆ లైట్ చుట్టూ గుబురుగా చెట్లు పేరుకుపోతే వాటిని గ్రామపంచాయతీ వారు తొలగించారు. కేవలం స్తంభం కనిపించటానికి అంత ఖర్చు చేసి లైట్లు నిర్మాణం చేశారా… వెలిగించే బాధ్యత ఎవరు తీసుకుంటారోనని ప్రజలు నిలదీస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నిసార్లు తెలియజేసిన అధికారులు నిద్రావస్థలో జారుకోవడం కడు శోచనీయం. ఇకనైనా హైమాస్ట్ లైట్లు వెలిగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావునా అధికారులు ఇప్పటికైనా స్పందించి హైమాస్ట్ లైట్లు వెలిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్