“ఆసక్తిగా కలిగించిన విద్యార్థుల వివరణ
చర్ల , నేటి సూర్య న్యూస్
జిల్లాలో ‘గురుదేవ్” పాఠశాల అన్ని రంగాల్లో ముందుంటుందని అనడానికి వారు చేసే ప్రతి ఈవెంట్ ఆ విద్యాలయాన్ని దేదీప్యమానంగా దినదినాభివృద్ధి చేస్తోంది. 365 రోజుల్లో మహిళా దినోత్సవమైనా… గణిత దినోత్సవమైనా సరే అది పూసగుచ్చినట్టు అందరినీ ఆకర్శింపజేసేలా… అందరి మదిలో చెరగని ముద్ర వేసుకుంటుందని చెప్పవచ్చు. ప్రతి డిసెంబరు 22వ తేదీన గణిత దినోత్సవం సందర్భంగా ముందస్తుగా “గురుదేవ్” విద్యాలయంలో శనివారం గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆద్యులైన శ్రీ శ్రీనివాస రామానుజం గారి చిత్రపటానికి గణిత ఉపాధ్యాయ బృందం పుష్పాలంకరణ గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు సుమారు 350 మంది విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొని, గణితం లో విభిన్న అంశాలకు సంబంధించిన ప్రాజెక్టు లను తయారు చేసుకుని వచ్చి , స్టాల్స్ ఏర్పాటు చేసుకుని , ఈ స్టాల్స్ ని చూడడానికి వచ్చిన విద్యార్థినీ విద్యార్థులకు చక్కగా తమదైన శైలిలో వివరిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు హెచ్.జి.వి.ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహింపజేసిన గణిత ఉపాధ్యాయులు బి.మేఘన, పి. స్వాతి, నాగేంద్రమ్మ, భార్గవి, ఇందిర మరియు మౌనిక గార్ల ను , ప్రాజెక్టు ల రూపకల్పన లో చక్కని ప్రతిభ కనబరిచి, ఎంతో ఓర్పు తో స్టాల్స్ చూడడానికి వచ్చిన ప్రతి విద్యార్థి కీ వివరిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు అందరినీ అభినందించారు. గణితం మన జీవన గమనం లో చాలా ఉపయోగకరమని ,ప్రతి విద్యార్థి గణితాన్ని ఇష్టం గా నేర్చుకోవాలని సూచించారు. అనంతరం గణిత ఉపాధ్యాయురాలు( హెచ్ .ఓ.డి) బి మేఘన మాట్లాడుతూ.. సంఖ్యామానంలో అత్యంత కీలకమైన సున్నా ఆవిష్కరణ ప్రపంచ గణిత శాస్త్రానికి భారతీయుల అద్భుత కానుక అన్నారు. గణితం అభివృద్ధిలో ప్రపంచ వ్యాప్తంగా భారతీయుల పాత్ర ఎంతో ఉందన్నారు. సంఖ్యామానానికి పట్టుగొమ్మ అయిన సున్నా (0) ఆవిష్కరణే దీనికి నిదర్శనమన్నారు. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ గొప్ప గణిత శాస్త్రవేత్తగా పేరు గడించారు. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరని తెలిపారు. రామానుజన్ గణిత శాస్త్ర మేధో సంపత్తి అద్భుతమైందని పేర్కొన్నారు. 13 ఏళ్ల నాటికే సొంతంగా సిద్ధాంతాలు రూపొందించడం ప్రారంభించారని తెలిపారు. గణితంలో ఆయన చేసిన కృషికి గుర్తుగా రామానుజన్ పుట్టిన రోజును (135వ జయంతి జాతీయ గణిత శాస్త్ర దినంగా పాటిస్తున్నామని వివరించారు. గణితంపై ఆసక్తితో అత్యున్నత పరిశోధనల కోసం 1914 మార్చి 17న రామానుజన్ ఇంగ్లాండ్ కు చేరుకొని పరిశోధనలకు ఉపక్రమించారని పేర్కొన్నారు. నిరంతర శ్రమతో 32 వరిశోధనా పత్రాలు సమర్పించారన్నారు. అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల రామానుజన్ అనారోగ్యం పాలయ్యారు. రామానుజన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారన్నారు. 1920 ఏప్రిల్ 26న ఆయన కన్నుమూశారు. శుద్ధ గణితంలో “నెంబర్ థియరీ’లోని రామానుజన్ పరిశోధనలు, స్ట్రింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనల వంటి ఆధునిక విషయాల్లో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. రామానుజన్ చివరి దశలో “మ్యాక్ తీటా ఫంక్షన్స్”పై చేసిన పరిశోధనలు ప్రసిద్ధమయ్యాయని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు టూ డైమన్షన్, త్రీ డైమన్షన్, ప్రాబబులిటీ, లాస్ ఆఫ్, లాగరిథం, బార్ గ్రాఫ్ చేసి చూపించారు. 1వ తరగతి చిన్న పిల్లలకు నెంబర్స్ ముందు, తర్వాత నెంబర్లు, షేవ్స్ మల్టీపుల్స్ తదితర ఆకారాలు చిన్న పిల్లలు చాలా చక్కగా సహనంగా ప్రదర్శించడం, వాటి గురించి వివరించడం అందరిలో ఆసక్తి రేకెత్తించిందన్నారు. ఇందుకు సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు, తోటి ఏడుగురు గణిత ఉపాధ్యాయులతో పాటు ఇతర సబ్జెక్టుల ఉపాధ్యా యులు , ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవం తంగా సాగేందుకు సూచనలు, సలహాలు ఇచ్చిన ప్రధానో పాధ్యాయులు హెచ్ జీవీ. గిరి, అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎం సుబ్రహ్మ ణ్యం, శ్రీనివాస్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.











