వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు
కొత్తగూడెం, నేటిసూర్య ప్రతినిధి: దళిత జర్నలిస్ట్ ఫోరమ్ వ్యవస్థాపకులు కాశ పోగు జాన్ జన్మదిన వేడుకలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల దళిత జర్నలిస్టు ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ కార్యాలయం లో కేక్ కటింగ్ చేసి అందరికీ స్వీట్లు అందజేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ మాట్లాడుతూ ప్రతీ జిల్లాలో అక్రిడేషన్ కమిటీలో స్థానం కల్పించాలని దళిత బంధు పేరుతో గత ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ ప్రస్తుత రాష్ట్రంలో అంబేద్కర్ అభయా హస్తం ద్వారా 12 లక్షల రూపాయలు మొదటి విడతలో దళిత జర్నలిస్టులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మొదటిగా దళితులకే కేటాయించాలని దళితుల జర్నలిస్టుల హక్కుల కొరకు అనేక పోరాటాలు చేస్తున్న వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు జాన్ అన్న పుట్టినరోజు వేడుకలు కొత్తగూడెంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బస్టాండ్ రైల్వే స్టేషన్లలో బీదవారికి యాచకులకు ఆహారం, త్రాగునీరు అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళిత జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు ఈదునూరి బాలకృష్ణ భూపేష్ గోపి రవీందర్ వినోద్ కిరణ్ తదితరులు పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు











