వక్తృత్వ పోటీల్లో ‘గురుదేవ్’ వారిదే పై చేయి

Picture of Rushi Kumar Sutar

Rushi Kumar Sutar

Chief Editor

చర్ల, నేటిసూర్య ప్రతినిధి :

‘ఇంతింతై వటుడింతై అన్న చందంగా జిల్లాలోనే అత్యంత ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలో ఓ ప్రైవేట్ స్కూల్ వారు జిల్లాలోనే మంచి గుర్తింపు తెచ్చుకుం టున్నారు. ఏ సందర్భ మైనా… ఏ పోటీ అయినా సరే అందు లోపాలుపంచుకున్నారంటే చాలు ఆ స్కూల్ పేరే మొదటి వరుసలో నిలుస్తుందని పలు వురు అనుకోవడం ఆ స్కూల్ యాజమాన్యం యొక్క పరిపక్వతను చాటిచెపుతోంది. అందులో భాగంగానే ‘మీ కోసం మేము న్నాం టీం’ ఆధ్వర్యం లో చర్ల మండలం లోని 11 ఉన్నత పాఠశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు ‘సామాజిక సేవలు – మానవత్వ విలువలు – ‘మన భాగస్వామ్యం’ అనే అంశంపై వక్తృత్వ పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో మండల స్థాయి ఫైనల్ కాంపిటేషన్ లో ప్రథమ బహుమతి గురుదేవ్ విద్యాలయం విద్యార్థిని అయిన భూహ్యవరపు మాధురీకి దక్కించుకున్నారు. ఈ బహుమతిని చర్ల సిఐ రాజు వర్మ  మీదుగా అందజేశారు. ఇందుకుగాను ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు హెచ్ జీవీ. ప్రసాద్ మాట్లాడుతూ… ఈ వక్తృత్వ పోటీల్లో తన పాఠశాల నుంచి విద్యార్థినీ ఎంపిక కావడం నిజంగా అభినందనీయమని, ఆమెను ప్రోత్సహించిన సదరు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాగే తమ పాఠశాల నుంచి ఆణిముత్యాలను వెలికి తీస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇంకా అకాడమిక్ కో-ఆర్డినేటర్స్ ఎంవీ. సుబ్రమణ్యం, జి. శ్రీనివాస్, తెలుగు ఉపాధ్యా యురాలు ఎస్. విశాల విద్యార్థినికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

Share :

 నోటిఫికేషన్స్